రాజస్థాన్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌కు సన్మానం

May 16,2024 21:22

రాజస్థాన్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ను సన్మానిస్తున్న అమలాపురం తాలూకా పోలీస్‌ సిబ్బంది

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించుటకు రాజస్థాన్‌ నుంచి వచ్చిన స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ను పోలీస్‌ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గురువారం అమలాపురం రురల్‌ సిఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ వీరబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తులో సహకరించినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం తాలూకా ఎస్‌ఐ వై.శేఖరబాబు, ఎఎస్‌ఐ డి.ఏడుకొండలు, అమలాపురం తాలూకా పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️