ప్రజాశక్తి-రావులపాలెం: రావులపాలెం మండలంలో ఆదివారం కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రావులపాలెం బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో చెరువును తలపిస్తుంది. అలాగే డ్రైన్లు ఉప్పొంగి స్థానిక రైతు బజార్, తహశీల్దార్ కార్యాలయం రోడ్లు జలమయమయ్యాయి. అరటి మార్కెట్ వద్ద వర్షపు రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. అకాల వర్షాలకు ఈనిక దశలో వరి పంటకు దోమ ఆశించి నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వాణిజ్య, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.