గోపి మూర్తి విజయంతో యుటిఎఫ్‌ సంబరాలు

Dec 9,2024 16:13
amuru

ఉపాధ్యాయులకు స్వీట్లు అందజేస్తున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి -ఆలమూరు

గోపి మూర్తి గెలుపుతో సోమవారం సాయంత్రం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో కృతజ్ఞత పూర్వక సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఎన్నికలో ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా యుటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం బలపరిచిన బొర్రా గోపి మూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇంతటి అపూర్వ విజయాన్ని అందించడంలో సహాయ సహకారాలు అందించిన యావన్మంది కార్యకర్తలకు హదయపూర్వక అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. వారిలో మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జొన్నాడ మనోజ్‌ కుమార్‌, ఆర్థిక కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి వైవివి.రమణ, జిల్లా ఎఫ్‌డబ్ల్యూఎస్‌ మెంబర్‌ పివివి జిఎస్‌ఎన్‌.మూర్తి, తదితరులు ఉన్నారు.

 

➡️