ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నాం

Nov 26,2024 23:43
IMG-

పి.గన్నవరం మండల పరిషత్‌ సమావేశంలో భారత రాజ్యాంగం పై మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ గిడ్డి

ప్రజాశక్తి – పి.గన్నవరం

ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకో గలుగుతున్నామని ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెపుతారని ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంఎల్‌ఎ గిడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించి ఆచరిద్దామని తహశీల్దార్‌ పి.శ్రీ పల్లవి అన్నారు. ప్రజలందరూ లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని ఎంపిడిఒ కెవి.ప్రసాద్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.నాగలక్ష్మి శ్రీనివాస్‌, సర్పంచ్‌ బొండాడ నాగమణి, పరిపాలనాధికారి వి.యస్‌.వి.శర్మ, కె. జయలలిత, ఆర్‌.రామకష్ణ, శ్రీనివాస్‌, కిషోర్‌, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️