దోషులను కఠినంగా శిక్షిస్తాం 

Jun 9,2024 11:15 #Konaseema
  • పోలీస్ జాగిలాలతో తనిఖీ
    డి.ఎస్.పి రామకృష్ణ

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఉద్రిక్తకంగా మారిన అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన సంఘటనపై వేగంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని రామచంద్రపురం డిఎస్పి బి.రామకృష్ణ, సీఐ పీ.దొర రాజు లు విలేకరులకు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా, విచారణ వేగవంతంగా జరుపుతామని, దీంతోపాటుగా రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ల ద్వారా దోషులను గుర్తిస్తామని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వీలైనంత త్వరగా దోషులను అరెస్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా దళితులు యువకులు శాంతి ఈత వాతావరణం కొనసాగించాలని ఉద్రిక్తతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదని దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

➡️