చెత్త నుండి సంపద సృష్టి పనులు వేగవతం

Mar 10,2025 11:15 #ambedkar konaseema

సేకరణను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎల్పిఓ రాజు
ప్రజాశక్తి – ఆలమూరు : చెత్త నుండి సంపద సృష్టి పనులు వేగవంతం చేశామని ఇన్చార్జి డిఎల్పిఓ, ఎంపీడీవో ఐ.రాజు అన్నారు. మండలంలోని చొప్పెల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరణపై సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి చెత్త నుండి సంపద తయారీపై ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధానాన్ని మండలంలో గల ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కూడా కల్పించడం జరిగిందన్నారు. అలాగే సేకరించిన చెత్త నుండి సంపద ఏ విధంగా తయారు చేయలనే అంశంపై ప్రత్యేక శిక్షణ మండల పరిధి అన్ని గ్రామాల పంచాయతీల సిబ్బందికి ఇచ్చామన్నారు. దీనిని వలన గ్రామంలో పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

➡️