నిరసన ర్యాలీలో పాల్గొన్న వైసిపి నేతలు, నిరుద్యోగులు విద్యార్థులు
ప్రజాశక్తి – అమలాపురం
వైసిపి పిలుపు మేరకు యువత పోరు బాట నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించారు.. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ డిఆర్‌ఒ రాజకుమారికి వైసిపి నేతలు అందజేశారు. వైసిపి యువత పోరుబాట కార్యక్రమంలో జిల్లాకు చెందిన నియోజక వర్గాలకు చెందిన ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్, ఎంఎల్‌సి కుడిపూడి సూర్య నారాయణరావు, జెడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, మాజీ ఎంఎల్‌ఎలు గొల్లపల్లి సూర్యా రావు, చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్య ప్రకాష్. పొన్నాడ సతీష్ కుమార్, పాముల రాజేశ్వరి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాసరావు. సంసాని బుల్లి నాని తదితరులు పాల్గొన్నారు.