ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి) : రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోటకు చెందిన టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ నరేంద్ర మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. తంబళ్లపల్లి నియోజకవర్గపు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కొండ నరేంద్ర మాట్లాడుతూ … తంబళ్లపల్లి.నియోజకవర్గంలో తాను చేపట్టిన రైతు సదస్సులు, ఇతర కార్యక్రమాలపై ఆయనకు వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా తాను రాజకీయాలకు వచ్చానని తాను పుట్టిన నియోజకవర్గం ప్రజలకు మంచి చేయాలన్నదే తన సంకల్పమన్నారు.
