ప్రజాశక్తి-కొండపి: ఢిల్లీలో ఈనెల 14, 15 తేదీలలో జరిగే నేషనల్ తైక్వాండో పోటీలకు కొండపి పంచాయతీ నుంచి 11 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు మన ఊరి వికాసం ఫౌండర్ ధర్మవరపు ప్రసాద్ తెలిపారు. బుధవారం పోటీలకు వెళుతున్న విద్యార్థులకు స్థానిక హ్యాపీ కిడ్స్ స్కూల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ప్రసాద్ విద్యార్థులకు కొన్ని మెలకువలు సూచనలు సలహాలు ఇచ్చారు. 11 మంది విద్యార్థులకు జరిగే పోటీలకు మన ఊరి వికాసం తరఫున ఎంట్రీ ఫీజు కడుతున్నట్లు ఆయన తెలిపారు. నేషనల్ తైక్వాండోలో సెలెక్ట్ అయిన విద్యార్థులు జూలో జరునున్న స్పెయిన్ బార్సిలోనియాలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చిన్నారులు ఉత్తేజపరిచే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని తెలిపారు. కట్టవారిపాలెం గ్రామంలో ఇప్పటివరకు ఏడు సంవత్సరాల నుంచి తైక్వాండో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 100 మంది చొప్పున ఏడు సంవత్సరాలలో 700 మందికి శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ మురళి, సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.