ప్రజాశక్తి-నందికొట్కూరుటౌన్ : బండలాగుడు పోటీలకు కొణిదెల గ్రామం ప్రసిద్ధి అనిఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. గురువారం గ్రామంలో గల శ్రీ మత్కొణిదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొణిదెల గ్రామంలో నిర్వహించే తిరుణాల్లో బండలాగుడు పోటీలకు అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు అందజేస్తున్న దాత ఆలయ ధర్మకర్త ఎస్.కిరణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. దాతలు, సహాయ సహకారాలు అందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్, గ్రామ సర్పంచ్ కొంగర నవీన్, రత్నం రాజు, బండి రంగస్వామి, సాలె మహేశ్వర, సన్నీ వినీల్, సిపిఎం రాజు, బాలస్వామి, దావీదు, శేఖర్, స్వాములు, సిద్దయ్య, ఆచారి, శ్రీనివాసులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
