కలెక్టర్‌తో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎకలెక్టర్‌తో కోవూరు ఎంఎల్‌ఎ భేటిప్రజాశక్తి-కోవూరు:కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలెక్టర్ హరినారాయణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాకు చేరుకున్న ప్రశాంతిరెడ్డి కలెక్టర్‌తో భేటీ అయి వివిధ అంశాలపై మాట్లాడారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అదే విధంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె మాట్లాడారు. నిధులు, పెండింగ్ పనులను ప్రశాంతిరెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి నారాయణన్ కోవూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరి స్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలపై తప్పకుండా దృష్టి సారిస్తామని కలెక్టర్ తెలిపారు.
