సాలుచింతల సెంటర్ సిమెంట్ రోడ్డును ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే

Jan 7,2025 16:21 #Nellore

నెల్లూరు :  కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం పంచాయతీ పరిధిలోని సాలుచింతల సెంటర్ మసీదు వీధిలో రూ. 8.5 లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న సిమెంట్ రోడ్డును మంగళవారం ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజా సంక్షేమం – అభివృద్ధి పనులకు అంకితమై పనిచేయడం తమ ప్రభుత్వ  లక్ష్యంమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానికుల సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఆమె హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు సాగడంలో సీఎం చంద్రబాబు నాయుడు  నాయకత్వం ఎంతో కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, బిపిసిఎల్ రిఫైనరీ వంటి ప్రాజెక్టులు వేలాది యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తల సహకారానికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

➡️