బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌ సాయం

Feb 13,2024 13:46 #helps, #Kovvali Foundation, #victims

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి పలువురు బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌వారు నెలకు సరిపడిన మందులను మంగళవారం అందజేశారు. కొవ్వలి ఫౌండేషన్‌ ద్వారా ప్రతినెల వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నరసాపురానికి చెందిన పెరాలసిస్‌ పేషంట్స్‌ చేగొండి నాగ శ్రీనివాస్‌, శీల్ల నరసింహారావులకు, రోడ్డు ప్రమాదంలో గాయపడి లేవలేని స్థితిలో ఉన్న సయ్యద్‌ అహ్మద్‌ కు, సీతారామపురానికి చెందిన లివర్‌ ప్రాబ్లంతో బాధపడుతున్న మెరిపే మోజేష్‌ కు ప్రతి నెల వారికి అవసరమైన మందులను అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెలకు సరిపడా మందులను మంగళవారం వారికి కొవ్వలి ఫౌండేషన్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్‌ నాయుడు ఆయన నివాసం వద్ద అందచేశారు. ఈ కార్యక్రమంలో మల్లాడి మూర్తి, రేవు పద్మారావు, గుడాల నాని, ఏ వి ఆర్‌, నండా రామకృష్ణ, బర్రి మురళి, తదితరులు పాల్గొన్నారు.

➡️