నూకాంబిక ఆలయ అదనపు ఈవోగా కృష్ణ

Nov 26,2023 14:25 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన మండలంలోని చింతలూరు శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆలయ అదనపు ఈవోగా ఎమ్.శివరామకృష్ణను నియమిస్తూ దేవాదాయ శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కృష్ణ పెనికేరుకు సంబంధించిన గ్రూప్ లోని వివిధ గ్రామాలకు చెందిన ఆలయాలకు ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే వారికి అమ్మవారి దర్శనంతో పాటుగా తీర్థ, ప్రసాదాలు అందజేస్తామన్నారు. స్థానిక పెద్దలు, ఆలయ ధర్మకర్తల మండలి సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు.