బ్యాలెట్‌ బాక్స్‌ల భద్రతపై కృష్ణా జిల్లా ఎస్పీ-కలెక్టర్‌ సమీక్ష

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : సార్వత్రిక ఎన్నికలు -2024 పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తికాగా, ఓటింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌ను భద్రపరచబోయే కృష్ణ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఐపిఎస్‌, జిల్లా కలెక్టర్‌ డికె.బాలాజీ ఐఏఎస్‌ తో కలిసి సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. కృష్ణ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు కు ఎంత మంది సిబ్బందిని వినియోగిస్తున్నది, అక్కడ తీసుకున్న అదనపు సౌకర్యాలు, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, పోలీస్‌ అధికారులకు బ్యాలెట్‌ బాక్స్‌ లు భద్రత గూర్చి పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని, మూడంచెల పటిష్ట భద్రత నడుమ ఈవిఎంలకు రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ తోపాటు స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జేవీ రమణ, చల్లపల్లి సిఐ నాగప్రసాద్‌, ఆర్‌ఐ సతీష్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

➡️