ప్రజాశక్తి-చల్లపల్లి : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తుమ్మా వీరమ్మకు బుధవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. చల్లపల్లి నుంచి 108 అంబులెన్సు సిబ్బంది లక్ష్మీపురం చేరుకుని ఆమెను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జీలగలగండి సమీపంలో వీరమ్మకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో పైలట్ షఫీ, ఆశా వర్కర్ ఎన్.పార్వతి సహకారంతో ఈఎంటీ దాసి బసవరాజు ప్రసవం చేశారు. తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని మచిలీపట్నం ఆసుపత్రిలో చేర్చారు.