నత్త నడకన నడిచే ఉపాధి హామీ పథకం

Jun 10,2024 15:34 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలో నత్త నడకన నడిచే ఉపాధి హామీ పథకం పనులు పెంచే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపద్యక్షురాలు వంకాయల పాటి రాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు తదితర కారణాల వల్ల ఉపాధి హామీ పనులు గుడ్లవల్లేరు మండలంలో నత్త నడకన సాగుతున్నాయని వాటిని వెంటనే పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. చంద్రాల పంచాయితీ పరిధిలోని ఉపాధి పనులను ఆమె స్థానిక నాయకులు బి.వి.శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో మెస్ట్రీ ల వ్యవస్థ ఉన్న చోట సక్రమంగా పనులు బాగానే జరుగుతున్న విషయం గమనిచమన్నారు. మెస్ట్రీ ల వ్యవస్థను పక్కన పెట్టి నడుపుతున్న చాలా ఇబ్బందులు వస్తున్నాయని పనులు సక్రమంగా జరటంలేదని విమర్శించారు. మెస్ట్రీ ల వ్యవస్థను కాపాడుకోవలన్నారు. ఈ నెల 17 వతెదీ వడ్లమన్నాడు గ్రామంలో జరిగే మండల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభకు జయప్రదం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మదిరి నాగరాజు, మెస్ట్రీలు .మడిరి నాగమణి, సుమలత తదితరులు పాల్గొన్నారు.

➡️