బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Jun 10,2024 14:49 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సోమవారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లపల్లి మండల టిడిపి అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు మాట్లాడుతూ పేదలకు ఉచిత కాన్సర్ వైద్యం అందిస్తున్న మహోన్నత సేవాతత్పరుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. చల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక, మోర్ల రాంబాబు, మాజీ డీసీ ఛైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ బోలెం నాగమణి లు కేక్ కట్ చేశారు. హిందూపురం నుంచీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముమ్మనేని రాజకుమార్ (నాని), ఎంపీటీసీ సభ్యురాలు పైడిపాముల స్వప్న, టీడీపీ రాష్ట్ర నేతలు జల్లూరు ప్రసాద్, మోర్ల ప్రసాద్, రావి చిట్టి, జిల్లా నేత మోర్ల శివ, వార్డు సభ్యులు అంబటి భువనేశ్వరరావు, షేక్ సిలార్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ నబీఘోరీ, నేతలు తాతా ప్రదీప్, వేముల హరికృష్ణ, బావిశెట్టి కనకదుర్గ, తొట్టెంపూడి మల్లి, అనగాని నాగేశ్వరరావు, మురాల నాగేశ్వరరావు, కృష్ణ, కుంభా కృష్ణ, మల్లంపాటి లీలా, ఎండి. యూనస్, ముమ్మనేని అఖిల్ వంశీ (బబ్లు) అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️