ప్రజాశక్తి-చల్లపల్లి : కూచిపూడి, మొవ్వ మండలంలో అవురుపూడి, చినుముత్తివి గ్రామాలలో ఈనెల 14, 15 తేదీలలో పరిధిలోని చినముతేవి, అవిరిపూడి గ్రామాల్లో సంక్రాంతిపండుగ, కనుమ సందర్భంగా ముగ్గుల పోటీ, పరుగు పందెం, స్లో సైక్లింగ్, కుర్చీలాట, ఆట పాట తదితర ఆటల పోటీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడును. కావున 14వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి చిన ముత్తెవి శివాలయం వద్ద, 15వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అవురుపూడి పాల కేంద్రం వద్ద ఆటల పోటీలు నిర్వహించ బడుతున్నాయి. కావున ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు పాల్గొని జయప్రదం చేయాలని, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా, డివైఎఫ్ఐ, కృష్ణాజిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు, ఏపి కౌలు రైతు సంఘం గ్రామాల కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం అవురుపూడి గ్రామంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి శీలం నారాయణరావు, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ మొవ్వమండల అధ్యక్షులు ఏనుగ శ్రీనివాసరావు (కొండా), బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ గ్రామ కార్మికులు గోపి, పాండురంగారావు, మద్దిరామయ్య నాగులపాటి గోపి, గట్టా సాయికృష్ణ, బాబి, గ్రామ కౌలు రైతులు ఏనుగు శ్రీనివాసరావు, వంగూరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.