ప్రజాశక్తి-చల్లపల్లి : డిసెంబర్ 1,2,3 తేదీలలో చల్లపల్లిలో జరగవలసిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కృష్ణా 25వ మహాసభలు అనివార్య కారణాలవల్ల డిసెంబర్ 15, 16, 17 తేదీలలో నిర్వహిస్తున్నట్లు మహాసభల ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. చల్లపల్లిలో గుంటూరు బాపనయ్య శ్రామిక భవనంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నందు అనేక ఉద్యమాల పురిటిగడ్డ, ఎర్ర జెండాల పోరాటాల గడ్డ అయిన చల్లపల్లి కేంద్రంలో జరుగుతున్న మహాసభల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి పెదప్రోలు రోడ్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నుండి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రధాన సెంటర్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభల, ర్యాలీ, బహిరంగ సభలలో పార్టీ కేంద్ర, రాష్ట్ర,జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు.ఈ మహాసభలు చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండేలా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, ఆహ్వాన సంఘం సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, ఆహ్వాన సంఘం మరియు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, యద్దనపూడి మధు,మోపిదేవి,ఘంటసాల,కోడూరు మండల కార్యదర్శులు బండి ఆదిశేషు,మేడంకి వెంకటేశ్వరరావు, పోలాబత్తిన మోహన్ రావు, చల్లపల్లి మండల కమిటీ సభ్యులు మహమ్మద్ కరీముల్లా, బండారు కోటేశ్వరరావు, బళ్లా వెంకటేశ్వరరావు, నంద్యాల ప్రభు, ఘంటసాల మండల కమిటీ సభ్యులు వాకా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.