దసరాను అందరూ సంతోషంగా జరుపుకోవాలి

Oct 10,2024 14:01 #Krishna district

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలోని ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల గ్రామోత్సవ ఊరేగింపు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి… శాస్త్రోక్త పూజలతో గ్రామోత్సవ ఊరేగింపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. భక్తులతో కలిసి, అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపులో ఎమ్మెల్యే రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. కన్నుల పండుగగా జరుగుతున్న అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఉత్సవాల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. 30వేల మందికి పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ను,ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు, టిడిపి నాయకులు కొడాలి రామరాజు, వల్లభనేని వెంకట్రావు, వెనిగండ్ల రామకృష్ణ (నాని), చేకూరు జగన్మోహన్రావు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, పొట్లూరి రవి, కొలా రాధాకృష్ణ, వల్ల భనేని బాబురావు, కన్య భాస్కర్ రావు, నారగాని శ్రీను, కొప్పునేమి పిచెశ్వరావు,గరికిపాటి రాంబాబు, పెన్నేరు రమేష్, దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు చిట్టిబొమ్మ వీర రాజు,పామర్తి సత్య బాబు,అడపా  చంద్ర శేఖర్ బాబు, మన్నెం వీరనరేంద్రరావు, వడ్లముడి పద్మజ,ఈడే వెంకట విష్ణు మోహన్ రావు,కొప్పినేని నాగ వెంకట లక్ష్మి,ఉస్తిల పావని,గుడ్లవల్లేటి వాణి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

➡️