స్వర్ణోత్సవాలకు వెళ్లిన గుడ్లవల్లేరు యుటిఎఫ్ నాయకులు

Jan 8,2025 13:23 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : యుటిఎఫ్ 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలు ఈనెల 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో పిఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి 20,000 పైగా యుటిఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 6వ తేదీ కాకినాడ పురవీదులలో 6000 మంది ఉపాధ్యాయులతో మహార్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ గౌరవ ఎంఎల్ సీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు కథం త్రొక్కారు. 7, 8 తేదీల్లో విద్యారంగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయ హక్కుల కోసం, సమాజంలోని మార్పుల కోసం, ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం, యుటిఎఫ్ సంఘానికి సంబంధించిన నివేదికలు, అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశముకు పెద్ద ఎత్తున గుడ్డల్లేరు మండలం నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరైనారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్సులు ఎల్ నరేంద్ర, ఏవి వరలక్ష్మి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ఆరోగ్యం, పి హరి శ్రీనివాస్, జి శ్రీనివాసరావు, కె ఎల్ శ్రీనాథ్, జి రాజేంద్రప్రసాద్, కే రత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️