ప్రజాశక్తి-మోపిదేవి: దివిసీమలో ఎంపిక చేసిన మండలాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం మోపిదేవి మండలంలోని మోపిదేవి లంక బొబ్బర్లంక తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం రాయితీలు విరివిగా ఇస్తుందన్నారు. 100 శాతం రాయితీతో రైతు మీద ఎ టువంటి ఆర్థిక భారం లేకుండా మొక్కలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ఎన్ రమేష్ పర్యవేక్షణలో 18 మంది రైతులకు సంబంధించిన పొలాలను పరిశీలించారు. మోపిదేవి మండలానికి కేటాయించిన త్రీ ఎఫ్ ఆయిల్ పంప్ కంపెనీ ప్రాంతీయ అధికారి పండ్రాజు రాంప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ విజయప్రసాద్, సూర్యరావు, తదితరులు పాల్గొన్నారు.