నీటి కాలుష్యంపై ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఫైర్

Jun 8,2024 15:28 #Krishna district

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే కొల్లు రవీంద్ర ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. తొలిగా మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని సున్నితమైన హెచ్చరించారు. కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుండటంపై ఎఈ సాయిప్రసాద్ పై ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కుళాయిల ద్వారా మురుగు నీరు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తాగునీటి సమస్యకు గల కారణాలను మున్సిపల్ కమిషనర్ ని అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.  తాగునీటి విషయంలో అలసత్వం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

➡️