సీపీఎం నేత ఆదిశేషుకు ఎమ్మెల్యే నివాళి

Jan 8,2025 13:07 #Krishna district

ప్రజాశక్తి-మోపిదేవి  : సీపీఎం సీనియర్ నాయకులు,  మోపిదేవి మండల సీపీఎం కార్యదర్శి బండి ఆదిశేషుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. మోపిదేవి ఎస్సీ కాలనీలో బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో ఆదిశేషు మృతి చెందగా, ఆయన భౌతికకాయాన్ని ఎమ్మెల్యే సందర్శించి నివాళులు అర్పించారు. ఆదిశేషు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదిశేషు మృతికి ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కూటమి నాయకులు నివాళులు అర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వెనిగల్ల నరసింహరావు, చల్లపల్లి సిపిఎం నాయకులు మధు, కరిముల్ల వాక రామచంద్రరావు, కుంపటి బాబూరావు మోపిదేవి మండలం నుంచి వివిధ శాఖల సభ్యులు పాల్గొన్నారు.

➡️