ప్రజాశక్తి-మచిలీపట్నం: “ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్” ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఘనంగా జాతి పిత మహాత్మా గాంధీ 155వ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక భాస్కరపురం వద్ద కల గాంధీ విగ్రహం వద్ద పూల మాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించి, గాంధీ సిద్ధాంతాలు మరియు భోధనల ప్రాముఖ్యతను మననం చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా యూనియన్ ప్రధాన కారదర్శి జి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచం లోని అనేక దేశాలలో యుద్ద వాతావరణం నెలకొని వున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ భోదించిన అహింస, శాంతి సిద్ధాంతాలకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది అన్నారు. పలువురు వక్తలు ప్రసంగిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో బహుళ జాతి కంపెనీలను అవ్హానించడం ‘విదేశీ వస్తు బహిస్కరణ’ వంటి మహాత్ముని పిలువుకు విరుద్ధం అని, ఇది తిరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి విధానాలకు దారితీస్తుందని ఆందోళన వెలియపుచ్చారు. మత సామరస్యాన్ని, దేశ లౌకికతత్వాన్ని, దేశ సార్వాభౌమత్వావాన్ని కాపాడుకోవాలి అని, గాంధీ ఆశయాలకు పునరoకితం అవ్వాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జె. సుధాకర్, జి. కిషోర్ కుమార్, డి.వాసు, ఎ శ్రీనివాసరావు, వై.స్వామినాద్, జి.కృష్ణ ప్రసాద్, పి.నాగయ్య మరియు ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు.