ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ సి.ఎల్ వెంకటరావు పల్లెల్లో పేద ప్రజలకు న్యాయమైన ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన 545మందికి గుడ్లవల్లేరు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగులకు డాక్టర్ సి.ఎల్ వెంకటరావు, నేత్ర సమస్యలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్లు కణితి శశిరేఖ హనుమకొండ దుర్గ భవాని, గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు విజయవాడ కామినేని హాస్పిటల్ వైద్యులు ఎస్.దాశరథి, లింగం శెట్టి వర్ధన్, సాధారణ వైద్యానికి గుడివాడ హోమియో వైద్యులు పి భవాని, తమ వైద్య సేవలను రోగులకు అందించారు. అనంతరం అవసరమైన రోగులకు డాక్టర్ సిఎల్ వెంకటరావు చేతుల మీదుగా ఉచిత మందులను పంపిణీ చేశారు.
