ప్రజాశక్తి-మోపిదేవి: మోపిదేవి మండలంలో సిపిఎంని గ్రామ గ్రామాన విస్తరింపజేసి ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చురుగ్గా పనిచేసేందుకు నూతన మండల కమిటీని సిపిఎం జిల్లా నాయకుల పర్యవేక్షణలో ఎన్నుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శీలం నారాయణరావు, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు పంచకర్ల రంగారావు పర్యవేక్షణలో మండల సిపిఎం శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్వర్గీయ గుంటూరు బాపనయ్యకు నివాళులర్పించి మోపిదేవి మండల కొత్త కమిటీని ప్రకటించారు. మండల సిపిఎం కార్యదర్శిగా చిరువెళ్ల రాజశేఖర్ కమిటీ సభ్యులుగా మరీదు సురేష్ బాబు, బెజవాడ నాగేశ్వరావు, కర్ర వెంకటేశ్వరావు, పులివర్తి నాగమల్లేశ్వరరావు, సహదేవుడు బండి నిర్మల, కొమ్ము జయరావులు నియమించబడినట్లు తీర్మానించారు. శాఖల విస్తరణలో భాగంగా బుధవారం సాయంత్రం చిరువోలు గ్రామ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలియజేశారు. కొత్త సభ్యత్వాలు నమోదు పార్టీ పిలుపుమేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు విజ్ఞాపనలు అధికారులుతో కలిసి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
