తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు 

Jun 8,2024 12:09 #Krishna district

మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సంతాపం తెలియజేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసమాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గానీ అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు.

➡️