ప్రజాశక్తి-చల్లపల్లి : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఆటలు పోటీలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగాయి. మొవ్వ మండల పరిధిలోని చినముత్తేవి గ్రామ శివాలయం స్వర్గీయ ఊచా కోటేశ్వరావు, బండి కోటేశ్వరరావు, ఉగాది శేషయ్య ల స్ఫూర్తిదాయకంతో ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలలో 96 మంది క్రీడాకారులు పాల్గొనగా ముగ్గులు, కుర్చీలాట , పరుగుపందెం , ఆట, పాట తదితర ఐదు రకాల గేమ్స్ నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగినది. గ్రామస్తుల సహాయ, సహకారాలతో గత మూడు సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుచున్నారు. మహిళలు, చిన్నారులు, రైతులు యువతీ యువకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటల పోటీలను తిలకించటం జరిగినది. పోటీలలో పాల్గొని గెలుపొంది ప్రతి ఆటకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ వెటర్నరీ జూనియర్ ఆఫీసర్ జి వెంకటయ్య, రావూరి రమేష్, క్రోవి కేశవ, యరా శివుడు, రావూరి రాజా, పోతుల చందు, కూనపుపరెడ్డి చిట్టిబాబు, యరా పట్టాభి, ఏ కే మోహన్ రావు, పి లక్ష్మణరావు, ఇషాక్, రాజులపాటి రాంబాబు, సహదేవుడు, క్రోవి సూర్యనారాయణ , తోట ప్రసాద్, కూనపు రెడ్డి మురళి, శరత్ బాబు, కూనపు రెడ్డి శ్రీనివాసరావు, పులి రాముడు, మహిళా సంఘం తరఫున మేరీ, నాగులు, మణి, లావణ్య, నాగలక్ష్మి, జయలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఎండి కరీముల్లా, ప్రభుదాసు, తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి గాయకులు పాడిన పాటలు ప్రేక్షకులను ఆలోచింపచేసినాయి.
