కూలి పని కరువు

Nov 29,2024 13:43 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : వ్యవసాయ రంగంలో యంత్రాలు రావడంతో కూలి పనులు లేక అల్లాడుతున్నామని మహిళా వ్యవసాయ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని ఆర పెడుతున్న మహిళలు తుఫాను ప్రభావం వల్ల రైతులు యంత్రలతో నూర్పుడి చేయటంతో కోతలు లేక ఉపాధి లేక పొట్ట గడవడమే కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూలి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కోతలు లేకపోవడంతో కూలి పనులు దొరకక పోస్తులు ఉండే పరిస్థితి మా కుటుంబంలో ఏర్పడిందని విచారణ వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికి డొక్కడు వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోతల సమయంలో కుటుంబాల అందరికీ పనులు దొరికే పని యంత్రాలు ఉపయోగించి కోతలు, నూర్పు చేయటం వల్ల పూర్తిగా ఉపాధి కోల్పోయామని జీవనం ఎలా కొనసాగించాలో తెలియక అయోమయ పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వ స్పందించి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

➡️