సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో రాష్ట్ర డిజిపి దంపతులు

Apr 12,2025 10:11 #ap dgp

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్: కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డిజిపి దంపతులకు దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ముందుగా హరీష్ కుమార్ గుప్తా దంపతులు నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి పట్టు వస్త్రాలుతోపాటు శ్రీస్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అవనిగడ్డ డిఎస్పి, సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారులు డిజిపి పర్యటనలో పాల్గొన్నారు.

➡️