ప్రజాశక్తి-చల్లపల్లి : చైతన్యవంతులైన ప్రజలతోనే స్వచ్ఛ భారత్ సాధ్యమని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ అన్నారు. బుధవారం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం చల్లపల్లి బైపాస్ రోడ్డులో నిర్వహించారు. అంతర్గత రహదారులలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించారు. గ్రామస్థులు తమ వీధులను సుందరంగా పరిశుభ్రతగా ఉంచుకునే ప్రయత్నం చేసి తమవంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ టీ.పద్మావతి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పైడిపాముల రాజేంద్ర, డీఆర్ఓ సీసీ తూము వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్, స్వచ్ఛ కార్యకర్తలు, పద్మావతి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
