ప్రజాశక్తి-చల్లపల్లి : సిపిఎం డివిజన్ మాజీ కార్యదర్శి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి కళా రంగానికి తీరంలోని పలువురు అన్నారు. స్థానిక గుంటూరు బాపనయ్య శ్రామిక భవనంలో శనివారం ప్రజానాట్యం మండల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకారామచంద్రరావు అధ్యక్షతన సుబ్బారెడ్డి సంస్కరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పోలినాయుడు మాట్లాడుతూ ప్రజా కళాకారుడు సుబ్బారెడ్డి కళల ద్వారా ప్రజలను చైతన్యపరచి ఉద్యమాల ఉద్యమాల విజయవంతం కృషిచేసిన మహా వ్యక్తి అన్నారు. సుబ్బారెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. సినిమాలు ఎక్కువగా చూసేవరని సినీ నటుల ప్రతిభను వెలికి తీసి ప్రజానాట్యమండలి కళాకారులకు శిక్షణ నిచ్చి ప్రోత్సహించే వారిని తెలిపారు. వీధి నాటకంలో విలక్షణ పాత్రను పోషించి ప్రేక్షకులను ఆకర్షించే వాళ్ళని మోపిదేవి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి శీలం నారాయణరావు అన్నారు. 2003, 2004,2005 సంవత్సరాలలో డిప్యూటీషన్ కార్యదర్శిగా పనిచేసే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలలో పోషించిన పాత్ర ముఖ్యమైనది కానీ ఒక రామచంద్రరావు ఆయన సేవలను కొని అడిగారు. తొలుతగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సుబ్బారెడ్డి మృతి చిహ్నంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి బండి ఆదిశేషు, చల్లపల్లి మండల కమిటీ సభ్యులుమహమ్మద్ కరీముల్లా, బండారు కోటేశ్వరరావు, కుంపటి బాబురావు బళ్లా వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కలపాల దానయ్య, మద్దాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
