కృష్ణమ్మ ఇసుక తిన్నెలపై సైతక శిల్పం

Nov 30,2024 00:40

ప్రజాశక్తి-తాడేపల్లి : సీతానగరం కృష్ణా నది ఇసుక తిన్నెల్లో అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్‌ సైతిక శిల్పం చెక్కారు. ఒరిస్సా ప్రభుత్వం నిర్వహించే శాండ్‌ ఆర్ట్‌ పోటీల్లో మూడేళ్ల నుండి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలాజీ వరప్రసాద్‌ ప్రథమ స్థానం సాధించి హ్యాట్రిక్‌ విజేతగా నిలిచారు. ఈసారి తమ విద్యార్దులను పోటీలకు పంపాలని నిర్ణయించుకొని ఎ.రోజా, వి.గోపీచంద్‌ను పంపిస్తున్నారు. సీతానగరం, తాడేపల్లిలోని కృష్ణా నదిలో శుక్రవారం ‘సన్‌ రైసింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘ అనే అంశంతో సైకత శిల్పం చెక్కి విద్యార్థులకు శాండ్‌ ఆర్ట్‌పై అవగాహన కల్పించారు.

➡️