ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జనసేన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈనెల 14న పిఠాపురంలో జరిగే 12వ పార్టీ ఆవిర్భావ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేద్దామని కొత్తపేట నియోజక వర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, నియోజక వర్గ పరిశీలకులు, ఉమ్మడి జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు సుంకర కఅష్ణవేణి పిలుపునిచ్చారు. మండలంలోని పినపళ్లలో గ్రామ సర్పంచ్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంగీత సుభాష్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీసంగీత లక్ష్మీకాంతం కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన నియోజక వర్గ స్థాయి ఆవిర్భావ సన్నాహక సభకు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు అందరూ ఆవిర్భావ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలు, సౌకర్యాల కల్పనపై వారు పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర కాలం సుదీర్ఘ పోరాటం అనంతరం తొలిసారిగా రాష్ట్రంలో అధికార భాగస్వామిగా కూటమి ప్రభుత్వంలో ఉంటూ నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ సభకు ప్రత్యేకత ఉందన్నారు. ప్రతీ జన సైనికుడు రెట్టించిన ఉత్సాహంతో సహచర పార్టీ సానుభూతి పరులను సమన్వయం చేసుకుని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్లను పార్టీ శ్రేణులందరూ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసిన సర్పంచ్ సుభాష్ కు పార్టీ నేతలు, అభిమానులందరూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్య్రమంలో ఉప సర్పంచ్ యనమదల రాణి శ్రీనివాస్, సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య, గ్రామ అద్యక్షుడు నామాల సుబ్బారావు, ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభి, సలాది జయప్రకాష్, తోట వెంకటేశ్వర్లు, సిరిగినీడి పట్టాభి, దేశబత్తుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం : నియోజకవర్గ ఇన్చార్జి బండారు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి సుభాష్ పిలుపు
