సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపే లక్ష్యంగా సిపిఎం, ప్రజాసంఘాలు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్-6 పథకల అమలులో కూటమి ప్రభుత్వం క్లీన్‌బౌల్డ్ దిశగా వెళ్తోందని, కొత్తగా ప్రజలపై పన్నుల భారానికి మరో 20 పత్రాలను సిద్ధం చేసుకుందని విమర్శించారు. పెట్టుబ డుల కోసమంటూ దావోస్ వెళ్లినా తెచ్చింది గాని, ఒప్పందాలు కుదర్చిందిగానీ ఏమీ లేదన్నా రు. గత ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగిపోగా ఈ ప్రభుత్వం మాయ మాటలు, గ్రాఫిక్స్‌తో మాయ చేస్తోందని ఎద్దేవ చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ అమరావతికి బిజెపికి చిల్లిగవ్వ ఇవ్వకుండా అ పార్టీని నెత్తిన పెట్టుకుని టిడిపి, జనసేన మోస్తున్నాయని, ఈ నేపథ్య ంలో లక్ష్మణరావు గెలుపు కోసం ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. సమా వేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, జి.రవిబాబు, ఎస్.ఆంజనే యులు నాయక్, నాయకులు కె.హనుమం తరెడ్డి, జి.బాలకృష్ణ, జి.ఉమశ్రీ, రజిని, మల్లీశ్వరి, దుర్గాబారు, నాగమ్మబారు, టి.మహేష్, బి.మహేష్, హనుమంతరావు, సిలార్ మసూద్, రబ్బాని, టిశ్రీను, హనుమంతరావు, కె.కోటేశ్వర రావు, శ్రీనివాసరెడ్డి, పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
