విజేతలుగా కర్నూలు, అనంతపురం జట్లు

Oct 3,2024 00:12

రాష్ట్ర జుట్టుకు ఎంపికైన క్రీడాకారులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని పెదమక్కెన జెడ్‌పి పాఠశాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రస్థాయి 68వ సెపక్‌ తక్రా పోటీలు బుధవారం ముగిశాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అనంతపురం, కర్నూలు కడప జిల్లాల నుండి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టుపై కర్నూలు జట్టు, బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు విజయం సాధించాయి. మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించగా రెండు, మూడు స్థానాలను కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా జట్లు దక్కించుకున్నాయి. విజేతలకు సత్తెనపల్లి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యెల్లినేడి రామస్వామి, జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఇంటర్మీడియట్‌ విద్యా ఆర్‌ఐఒ జి.కె.జుబేర్‌, గుంటూరు జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ, బహుమతులు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రజట్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎం.అన్న పూర్ణమ్మ సాంబశివరావు, సెపక్‌ తక్రా అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జి.శ్రీనివాసులు, టోర్నమెంట్‌ పరిశీలకులు సి.మారుతీ ప్రసాద్‌, అండర్‌ -19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి జి.నరసింహారావు, సహాయ కార్యదర్శి సి.హెచ్‌.పద్మాకర్‌, ఇంటర్‌ క్రీడల కార్యదర్శి యస్‌.సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.శివరామకష్ణ, పిఇటిలు పాల్గొన్నారు.రాష్ట్ర బాలుర జట్టుఎమ్‌.ఉమేష్‌ (కర్నూలు), ఎస్‌.శివకృష్ణ (ప్రకాశం), వై.రాహూల్‌ (పశ్చిమగోదావరి), యు.వెంకటేష్‌ (నెల్లూరు), వై.విశ్వాస్‌ పాల్‌ (తూర్పుగోదావరి), స్టాండ్‌ బైలు… ఎం.మణికంఠ (కర్నూలు), ఎస్‌.రోహిత్‌ (అనంతపురం), కె.శ్రీనాధ్‌ (గుంటూరు).రాష్ట్ర బాలికల జట్టుసి.మానస (అనంతపురం), కె.రమ్య (అనంతపురం), బి.ఉమాదేవి (కృష్ణా), షేక్‌ మనీషా బేగం (పశ్చిమగోదావరి), ఎస్‌.హసీనా (కర్నూలు), స్టాండ్‌ బైలు… ఆర్‌.అమృత (కృష్ణా), జి.చైతన్య కుమారి (అనంతపురం), టి.యామిని (గుంటూరు).

➡️