అరుదైన సర్జరీ  

May 16,2024 12:45 #Kurnool

7 నెలల శిశువును కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

ప్రజాశక్తి-కర్నూల్ : 7నెలల శిశువు బెడ్ పై నుంచి పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం మెడికవర్ హాస్పిటల్స్ , కర్నూల్ కి తీసుకొనిరావడం జరిగింది. బెడ్‌ పై నుండి పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో స్పృహ కూడా కోల్పోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. మెడికవర్ వైద్యులు తక్షణమే స్పందించి వెంటిలేటర్ ఫై ఉంచి మరియు చికిత్స మొదలు పెట్టడం జరిగింది. CT స్కాన్ తీయడం అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శిశువును ఆపరేషన్ థియేటర్ కి తరలించడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉండగానే గుండె స్పందన నిలిచిపోవడం దానిని విజయవంతంగా పునరుద్ధరించడం జరిగింది. శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి మెదడులోని రక్తస్రావంని తొలగించడం జరిగింది.ఈ యొక్క ప్రక్రియ కేవలం గంటలోపల మాత్రమే జరిగింది. శస్త్రచికిత్స తర్వాత కూడా శిశువుకు BP తగ్గిపోవటం, రక్త స్రావం, మూర్ఛలు రూపంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. డాక్టర్ విశ్వ కుమార్ K S మరియు డాక్టర్ మురార్జీ నేతృత్వంలోని పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ టీమ్ 24/7 శిశువుకు చికిత్సఅందించడం వల్ల శిశువును కాపాడుకోగలిగాం. నాలుగు రోజుల తరువాత వెంటిలేటర్ తొలగించడం జరిగింది. బాబు ఎటువంటి న్యూరో డీసెబిలిటీస్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడు.

అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు క్లస్టర్ హెడ్ డాక్టర్ వై. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్ కి తీసుకువస్తే (గోల్డెన్ అవర్లో ) మనం కాపాడగలం. సరైన సమయంలో సరైన వైద్యం, అత్యాధునిక సదుపాయాలు మరియు అనుభవజ్ఞులైన డాక్టర్స్ మన మెడికవర్ హాస్పిటల్స్ లో ఉండటం వల్ల ఈ రోజు ఈ యొక్క శిశువు కాపాడగలిగాం అని అన్నారు.

➡️