మళ్ళీ కుర్చీల వివాదం

Nov 30,2024 12:49 #Kurnool District

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక కుర్చీలు ఎందుకు ?
చైర్మన్ పోడియం ముట్టడించి వైస్ చైర్మన్, వైసీపీ కౌన్సిలర్లు 

ప్రజాశక్తి-ఆదోని: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన కౌన్సిల్ వివాదాలకు అడ్డాగా మారింది నెలకు ఒకసారి జరిగే సమావేశం రసభసగానే సాగుతోంది. ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్పర్సన్ శాంత అధ్యక్షతన మొదలైంది సమావేశం ప్రారంభంలోనే కుర్చీల ఏర్పాటుపై వివాదం మరోసారి ముదిరింది. గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లకు ప్రత్యేక కుర్చీలు ఉండేవి మూడు నెలలుగా సాధారణ కౌన్సిలర్ల వరుసలోనే కూర్చోవాలని చైర్పర్సన్ శాంత చెప్పడం వల్ల గత కౌన్సిల్లోనే వివాదం ముదిరి సమావేశం వాయిదా పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ సమావేశంలో కూడా కుర్చీల ఏర్పాటు పైనే వివాదం ముదిరింది. గత మూడు నెలలుగా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు కుర్చీల కోసం మూడవ నెల కౌన్సిల్ సమావేశంలోనూ చైర్పర్సన్ బోయ శాంతతో కౌన్సిలర్ వాగ్వివాదం చేశారు. పోడియం చుట్టుముట్టి వ్యతిరేకంగా వైస్ చైర్మన్లు నరసింహులు మహమ్మద్ గౌస్ కౌన్సిలర్లు ఇంతియాజ్ రాజేశ్వర్ రెడ్డి చలపతి అశోక్ ఫయాజ్ అహ్మద్ లోకేశ్వరి నినాదాలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ప్రత్యేక కుర్చీలు ఎందుకు అని ప్రశ్నించారు. చైర్మన్ పోడియం ముట్టడించి వైస్ చైర్మన్, కౌన్సిలర్ల నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కుర్చీలను తొలగించారు. ప్రత్యేక కుర్చీలు వేసేవరకు కింద కూర్చొని నిరసన చేపడతామని సమావేశంలో పాల్గొంటామని కౌన్సిలర్లు కింద బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణ మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ సైతం నిలబడి సమావేశంలో పాల్గొన్నారు.

➡️