వృత్తివిద్యపై అవగాహన ఉండాలి 

Feb 10,2024 14:11 #Kurnool
awareness on occasional courses

ప్రజాశక్తి-ఆలూరు: విద్యార్ధులకు విద్యతో పాటు వృత్తి విద్య పై అవగాహన కలిగి ఉండాలని వృత్తి విద్యా శిక్షకులు ప్రకాష్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవరావు,ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వీరేష్ అన్నారు. శనివారం వృత్తి విద్యా కమీషన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు 9వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు లేర్నెట్ స్కిల్స్ సహకారంతో ఫీల్డ్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను ఆదోని లోని ఆర్పిసి ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్ కు తీసుకవెళ్లి కంప్యూటర్ స్కిల్స్, ప్రోగ్రామ్స్ పై నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వృత్తి విద్యపై కూడా అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ట్రిప్ కు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ప్రత్యక్ష అనుభవాలు ద్వారా బోధన చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పిఈటి ఈరన్న,  యోగ టీచర్ ప్రవల్లిక పాల్గొనడం జరిగింది.

➡️