జిల్లాస్థాయి పోటీలలో ఉర్దూ స్కూల్ విద్యార్థులకు కాంస్య పతకాలు

Nov 23,2024 13:30 #Kurnool District

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : జిల్లాస్థాయి ఆట్యా, పాట్యా పోటీలలో ప్రభుత్వ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కాంస్య పతకం సాధించారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లా ఆట్యా పాట్యా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ప్రభుత్వ ఉర్దూ బాలురఉన్నత పాఠశాల బాలికలుకాశ్య పథకాలు సాధించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్పరాజ్ అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు అకాడమిక్ నుంచి, కోకరుకులం యాక్టివిటీలోనూ,క్రీడా పోటీలలోను ప్రతిభ పాటవాలు ప్రదర్శించి బహుమతులు, పతకాలు, ప్రశంస పత్రాలు సాధించడం హర్షనీయమన్నారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి పోటీలలోను రాణించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్ విజయకుమార్ కృషిని, పతకాలు సాధించిన బాలికలు తస్లీమ్ ,అజీమా,నుస్రత్సానియా ,హసీనా ,ముల్లాసన ,బషీర్బాను ,నస్రిన్ ,నాజియా ,యాస్మిన్ ,నిలోఫర్,జహర లను అభినందించారు.

➡️