బిజెపిని, దానికి మద్దతుదారులను ఓడించండి

Mar 31,2024 14:01 #Kurnool

వైసిపి ,టిడిపిలను చిత్తుచిత్తుగా ఓడించండి

ప్రజలకు సిపిఎం పిలుపు

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : మతోన్మాద బిజెపిని దానికి మద్దతు తెలుపుతున్న ,వైసిపి టిడిపి ,జనసేన లను చిత్తుచిత్తుగా ఓడించాలని, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మొహమ్మద్ షరీఫ్, సిపిఎం సీనియర్ నాయకులు డి. పార్వతయ్య లు ప్రజలకు పిలుపునిచ్చారు.కర్నూలు నగరంలోని ఒకటో వార్డు పలు విధులలో సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది .ఈ సందర్భంగా కర్నూలు సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి కి మీ విలువైన ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ షరీఫ్ ,డి పార్వతయలు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రత్యేక హోదా ఇస్తానని ,చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షిగా చెప్పి షట గోపురం పెట్టిన ఘనత బిజెపి ఉంది అని మండిపడ్డారు.విభజన హామీలు అమలు చేయని , కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, ఒక్కటంటే ఒక్కటి కూడా బిజెపి హామీ అమలు చేయలేదని, నిప్పులు చెరిగారు. అటువంటి బిజెపికి మన రాష్ట్రానికి సర్వనాశనం చేసిన,కేంద్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా అడుక్కొని మరి వైసిపి, టిడిపి లు బిజెపికి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ యొక్క పాదాల దగ్గర పెట్టి, వీరి యొక్క కేసుల నుండి తప్పించుకోవాలని, ఆంధ్ర ప్రజలను బలి చేస్తా ఉన్నారని దుయ్యబట్టారు.విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మివేస్తామన్న, ఎన్ .ఆర్. సి, సి .ఏ. ఏ, ఆర్టికల్ 370 ,రైతులకు వ్యతిరేకంగా, కార్మికుల వ్యతిరేకంగా, దళితులకు, మైనార్టీల వ్యతిరేకంగా, ఉన్న ఈ దుష్ట కూటమిని చిత్తుచిత్తుగా ఓడించి ,ఇండియా కూటమి బలపరుస్తున్న, సిపిఐ, కాంగ్రెస్ అందరు కూడా కలిసి ప్రజల కోసం నిరంతరం, పోరాడుతున్న ,ప్రజా సమస్యల, పరిష్కారమే ధ్యేయంగా ,పనిచేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి కి, భారీ మెజార్టీతో ఓట్లు వేసి ,వేయించి, గెలిపించాలని ,వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు, ,రాజేంద్ర బాబు, ఎల్లప్ప ,గని ఖాన్ ,ఖలీల్, షేక్షావలి, శేషావలి ,శాలి బాబు, మహబూబ్ ,బాబులి తదితరులు పాల్గొన్నారు.

➡️