ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్లో కులమతాలకు అతీతంగా బెరాక చర్చి ఫాదర్ ఆశీర్వాదం అధ్యక్షతన వెల్లాల మధుసూదనశర్మ చేతులమీదుగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూధన శర్మ మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి గెలిచిన తరువాత పండుగలన్నీ కూడా అందరూ కులమతాలకు అతీతంగా మత సామరస్యంతో జరుపుకుంటున్నారని అందుకు నిదర్శనమే ఈరోజు మా అమరావతి నగర్ వార్డులోని బెరాకా చర్చి నిర్వాహకులు ఆశీర్వాదం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారని ఇలాంటి కార్యక్రమాలను అందరూ స్వాగతించాలని మధుసూదన శర్మ అన్నారు. ఈ సందర్భంగా చర్చీఫాదర్ ఆశీర్వాదంకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో మహబూబ్ బాషా, వీరేష్, నబీరసూల్ పాల్గొన్నారు.
