డాక్టర్ కిరణ్ కుమార్ సలహా
ప్రజాశక్తి-ఆదోని: ఎండల తీవ్రత పెరుగుతుందని వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సాష హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. వేసవిలో పిల్లలును ఎండలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు పంపాలన్నారు. ఉదయం, సాయంత్రం పూటలు మాత్రమే బయట ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలన్నారు. మధ్యాహ్నం 11.45 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బయట ఆడుకోవడానికి మీ పిల్లలను పంపొద్దని సూచించారు. పగటిపూట మీ బిడ్డను తగినంతగా హైడ్రేట్గా ఉంచండి. నిమ్మకాయ నీళ్లు, లస్సీ, మజ్జిగా, కొబ్బరి నీళ్లు, సబ్జా వాటర్ ఇవ్వలన్నారు. పిల్లలు ఈ ఎండల్లో కూల్ డ్రింక్స్, ఎరేటెడ్ డ్రింక్స్, టెట్రా ప్యాక్డ్ జ్యూస్లు తాగాలని మారాం చేస్తూ ఉంటారని వాటిని ఇవ్వరాదన్నారు. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని ఇది ఊబకాయానికి
దారితీయవచ్చని తెలిపారు. మీ పిల్లలతో బయటకు వెళ్లాల్సి వస్తే, కచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకువెల్లలన్నారు. మీతో మజ్జిగ తీసుకువెళ్తే ఇంకా
మంచిదని, మజ్జిగా మీ పిల్లలను రిఫ్రెష్గా ఉంచుతుందన్నారు. రోడ్డు పక్కన ఉన్న నీటిని తాగడం, రోడ్సైడ్ స్టాల్స్ లోని జ్యూస్లు, నిమ్మరసం
వంటి పానీయాలు తీసుకోవడం మానుకోవలన్నారు. మీ పిల్లలు బయటకు వెళ్లే 15 నిమిషాల ముందు వారి బాడీకి సనిన్ని అప్లై చేయలని, సనీన్ను ముఖంపైనే కాకుండా మెడ, చేతులకు కూడా అప్లై చేయలన్నారు. వాళ్లు ఆడుకునేప్పుడు క్యాప్ ధరించమని చెప్పాలన్నారు. క్యాప్ లేకపోతే, కాటన్ స్కార్ఫ్ తలపై కపాలని కూలింగ్ గ్లాస్ వాడాలన్నారు. మధ్యాహ్నం పూట మీ పిల్లలు బయటుక వెళ్లకుండా.. వారిని బిజీ చేయలన్నారు. డ్రాయింగ్, సింగింగ్, డ్యాన్స్, కుండలు తయారు చేయడం వంటి ఇండోర్ వర్క్ చేయించాలన్నారు. ఈ సమయాన్ని మీ పిల్లలతో బంధం పెంచుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చన్నారు. చిన్న చిన్న ఇంటి పనులను చేయమని, మీకు సహాయం చేయమని వారిని ప్రోత్సహించలన్నారు. ఉదయాన్నే, సాయంత్రం పూట ఈత, జాగింగ్, సైక్లింగ్, ఏదైనా ఫీల్డ్ స్పోర్ట్స్ వంటి ఓట్ డోర్ యాక్టివికీ నేర్పించాలన్నారు.
ఈ సీజజ్లో జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది వారికి జంక్ ఫుడ్, స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్ పెట్టవద్దన్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే, క్యాలరీలు తక్కువగా ఉండే
పోషకాహారం అందించాలన్నారు. మీ పిల్లలకు కాటన్ దుస్తులు దరింప చేయిస్తూ ఇవి చెమటను బాగా పీల్చుకుంటాయన్నారు. సింథటిక్ దుస్తులు వేయవద్దన్నారు. ఇవి చెమటను పీల్చుకోవు. ఉష్ణోగ్రతలు కూడా పెంచుతాయని వేడిని గ్రహించే ముదురు రంగు దుస్తులకు బదులుగా లేత రంగులో ఉండే బట్టలు వేయలన్నారు. ఈ సీజన్లో శరీరాన్ని చల్లబరచడం చాలా అవసరమని అందుకే రోజుకు కనీసం 2 సార్లు స్నానం చేయించాలన్నారు. స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని ఈ జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా నివారించవచ్చని వివరించారు.
