రాజ్యాంగ ఫలాల ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

Apr 14,2025 13:34 #Kurnool District

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ప్రజాశక్తి-పత్తికొండ : రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పత్తికొండ అంబేద్కర్ కూడలిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేశ్రీదేవి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగనన్న నేతృతంలో గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసినదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే చట్టాలను తుంగలో తొక్కి, రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజా వ్యతిరేక పాలనను ఇలాగే కొనసాగిస్తే పార్టీ అధ్యక్షుడు జగనన్న నేతృత్వంలో ప్రజలను ఏకంచేసి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ,ఎంపీపీ నారాయణ దాస్ , మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక , మండల కన్వీనర్ మరియు రాష్ట్ర పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల తాలుకా అధ్యక్షులు, సర్పంచులు ఎంపిటిసి సభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

➡️