డ్రైనేజీ నిర్మాణం చేపట్టండి : డివైఎఫ్ఐ

Feb 2,2025 13:32 #Kurnool District

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : జి.సింగవరం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు.
కర్నూలు మండలం జి.సింగవరం గ్రామంలో సచివాలయం కార్యదర్శి సలోమికి డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి సురేష్ గ్రామ నాయకులు వంశీ, గురు ప్రసాద్, శశి, భాషలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ గ్రామంలో అనేక సంవత్సరాలు నుండి డ్రైనేజీ నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వర్షపు నీరు, మురికి నీరు, ఇళ్లలో నుండి వచ్చే నీరు కాలువల నిర్మాణం లేక రోడ్లపై పారుతున్నాయని అన్నారు. రోడ్లపై నీళ్లు పారడం ద్వారా రోడ్లు పచ్చగా మారి ప్రజలు నడవలేక కింద పడుతున్నారని అన్నారు.
నీళ్లు ఎక్కడపడితే అక్కడ నిలవడం ద్వారా దోమలకు నిలయంగా మారుతున్నాయని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలియజేశారు.
ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం గ్రామ పరిశుభ్రత కోసం వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

➡️