ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : సిపిఎం మాజీ కార్పొరేటర్ టి రాజగోపాల్ కు భార్య వియోగం కలిగింది. రాయలసీమ పేపర్ మిల్లు కార్మిక పోరాటాల్లో పాలుపంచుకునే సమయంలో మహిళా కార్యకర్తగా ఉద్యమంలో తనదైన శైలిలో పాత్ర పోషించారు. సిఐటియు ఉద్యమ నాయకుడిగా భర్త రాజగోపాల్ చేసిన అనేక పోరాటాలు ఆమె వెన్నంటి ఉంటూ సహాయ సహకారాలు అందించారు. పేపర్ మళ్లీ ఉద్యమంలో భర్తపై శత్రువర్గాలు హత్యాయత్నం చేసిన సందర్భంలోనూ ఆమె ఆయనకు కంటికి రెప్పలా ఉంటూ సేవలందించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం 8:30 గంటలకు తుది శ్వాస విడిచారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నివాళి
ఆమె మృతదేహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి సోమవారం ఉదయం నాగమణి భౌతికకానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు బసయ్య, ఐలు జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ, సిబ్బంది ఎల్లాగౌడు, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు