ఆదోని అభివృద్ధికై లోకేష్ హామీ

Jun 8,2024 16:59 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : యువగళం పాదయాత్రలో ఆదోనిలో నెలకొన్న సమస్యలను మర్చిపోనని పరిష్కార దిశగా చొరవ చూపుతానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే లోకేష్ హామీ ఇచ్చారని ఆదోని తెలుగు యువనేత మారుతి నాయుడు తెలిపారు. ఉండవల్లిలో నారా లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఆదోని రాజకీయ పరిస్థితులను రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బసాపురం వెంకటేష్ చౌదరితో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌ని మంగళగిరి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాని అన్నారు. ఆదోని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారన్నారు. ఆదోనిలో జరిగిన యువగడం పాదయాత్ర సక్సెస్ లో పాలుపంచుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అన్నారు. ఆదోని సమస్యలు పట్ల లోకేష్ సానుకూలంగా స్పందించారని మారుతి నాయుడు తెలిపారు. లోకేష్ ను క‌లిసిని వారిలో పోలినేని సూర్యనారాయణ, వినయ్, లోకేష్, రఘు, రామకృష్ణ ఉన్నారు.

➡️