ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : మిర్యాలగూడలో ఆదివారం రైస్ మిల్ అసోసియేషన్ చోటుఖాన్ ఓపెన్ ఛాంపియన్ కరాటే పోటీలలో జిల్లా జట్టుకు పతకాలు వచ్చాయని మాస్టర్ రాఘవేంద్ర తెలిపారు. కర్నూల్ నుండి 42 మంది విద్యార్థులు అనగా 21మంది బాలికలు 21 మంది బాలులు కరాటే కటాస్ ఈవెంట్లలో పాల్గొనగా 23 మందికి బంగారు పతకాలు, 7 గురికి సిల్వర్ మెడల్స్, 12 మందికి బ్రాంజ్ మెడల్స్ సాధించి కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ లో విజేతలుగా నిలిచి బెస్ట్ ఆఫ్ ప్లేస్ ట్రోఫీని అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్ బి రాఘవేంద్ర, మహావీర్ బహదూర్, చందు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.